స్వతంత్ర వెబ్ డెస్క్: కళింగ సామాజిక తరగతికి ఎనలేని సేవలందించిన కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు శతజయంతి వేడుకల సన్నాహాక సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ తమ్మినేని వీరభద్రం, మంత్రి సీరిది అప్పలరాజు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంతులు అధికారుల నిర్ణయం మేరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా బొడ్డేపల్లి జయంతి ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి జగన్‌కు స్పీకర్ తమ్మినేని ధన్యవాదాలు చేశారు.