ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్ అనేది ఏమైనా పెద్దపనా? ఇప్పుడు తాను చేయొద్దని చెప్పినా తమ నేతలు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని అన్నారు. అలాగే తాము గుడ్‌బుక్ రాసుకోవడం కూడా మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామని.. వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని అన్నారు…. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలని.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలన్నారు జగన్.