ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి గిడుగు రుద్రరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోడీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీరును తప్పుపట్టారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక అపవిత్ర కలయిక అంటూ మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ ప్రధాని కావడం తధ్యమంటూ ధీమా వ్యక్తం చేసారు.


