- అతికష్టం మీద విజయలక్ష్యం సాధించిన భారత్

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారతజట్టు అతి కష్టం మీద గెలిచింది. సీరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు విజయలక్ష్యం కేవలం 145 పరుగులు కాగా, టాప్ ఆర్డర్ అంతా విఫలం కావడంతో శ్రేయాన్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్… తమ ఇన్నింగ్స్‌ను విజయ లక్ష్యం వరకూ కొనసాగించారు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును మరో వికెట్ కోల్పోకుండా ముందుకు నడిపించారు. శ్రేయాన్ అయ్యర్ 29 పరుగులు, అశ్విన్ 42 పరుగులు చేశారు.

భారత్ మొదటి ఇన్సింగ్స్ 314 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 7 వికెట్లకు 145 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్సింగ్స్‌లో 227 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 231 పరుగులు చేసింది.