25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

హనుమండకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్‌ శ్రేణులు. రవాణాశాఖ బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డిపై విమర్శ లు గుప్పించారు.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని బజారు వాడి కాలనీలో.. ఆర్టీసీ డ్రైవర్‌ రాజేశం ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు.

వేములవాడలో రుద్రాభిషేకం

పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించారు. అనంతరం సాయంత్రం సదస్యం చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.

పోలవరం బోటు ప్రయాణం

అల్లూరి జిల్లా రంపచోడవరం గోదావరి పరివాహక ప్రాంతం నిత్యం పర్యటక బోట్లతో కళకళలాడుతోంది. దేవీపట్నం మండలం గొందురు గ్రామంలో గల పోచమ్మ గండి నుంచి పాపికొండల విహార యాత్ర ఆద్యం తం ఆ ప్రాంతం విశేషాలతో కొనసాగుతోంది. ఆ ప్రాంత గ్రామాల అందాలు ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరచ డంతో పాటు మంత్రముగ్దులను చేస్తోంది.

పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడ నుంచి గంగారం వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ జియో పైప్ లైన్ కోసం తీసిన కాలువలో పడింది. మూలమలుపు వద్ద ఓ వాహనాన్ని తప్పించబోయి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరిపీ ల్చుకున్నారు.

గ్రూప్ -1 పరీక్షలు …. 144సెక్షన్ అమలు

సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8వేల 223 మంది అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఇక సిద్ధిపేట డిగ్రీ కళాశాల సెంటర్‌లో పది మంది అభ్యర్థులను నిమిషం ఆలస్యంగా కారణంగా లోపలికి అనుమతించలేదు అధికారులు.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 6వేల 729 అభ్యర్థుల కోసం 18 పరీక్షా కేంద్రా లను సిద్ధం చేశారు. ఇక నిర్మల్ జిల్లాలో 4వేల 608 మంది అభ్యర్థుల కోసం 13 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు భారీ పోలీస్ కట్టుదిట్టం చేశారు.

హైదరాబాద్ అబిడ్స్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. నిమిషం ఆలస్యం నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు త్వరగానే చేరుకున్నారు. అబిడ్స్ స్టాంలి సెంటర్‌ వద్ద అభ్యర్థుల సందడి నెలకొంది. అంతకుముందు పరీక్షా కేంద్రం వద్ద అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు.

సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అంతకుముందు పరీక్ష కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 9వేల 672 మంది పరీక్ష రాస్తుండగా 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక సిద్ధిపేట జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 8వేల 233 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అదే విధంగా మెదక్ జిల్లాలో 3వేల 921 మంది 10 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మధ్యాహ్నం వరకు 144 సెక్షన్ అమలు చేశారు.

వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 9వేల 92 మంది కోసం జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రావిణ్య చెప్పారు. 17 మంది డిపార్ట్‌మెంట్ అధికారుల తోపాటు 25 మంది పర్యవేక్షకులు, ఐదుగురు రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.. అదే విధంగా హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలలో 22వేల 665 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారన్నారు.

సంగారెడ్డి జిల్లా ఎల్లంకి కాలేజీలో ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా పూర్తైంది. అంతకుముందు అభ్యర్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 816 మంది అభ్యర్థుల కోసం అధికారులు ముమ్మరం ఏర్పాట్లు చేశారు. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతి లేకపోగా…ఆధార్‌ కార్డు గానీ, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా చూపిస్తేనే అధికారులు లోపనికి అనుమ తించారు.

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యం కారణంగా సంగారెడ్డి జిల్లాలో ఆరుగురి అభ్యర్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా అధికారులు కఠిన నిబంధలు అమలు చేశారు.

మేడ్చల్ జిల్లా వెంకటాపూర్ అనురాగ్ కళాశాలలో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా పూర్తైంది. అంతకుముందు అధికారులు పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను హాల్లోకి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడమ పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిం చారు. ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

ప్రశాంత వాతావరణంలో వరంగల్ జిల్లా అధికారులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. సాధారణ అభ్యర్థులతో పాటు వరంగల్ హంటర్ రోడ్డులోని ఓ స్కూల్‌లో ట్రాన్స్‌జెండర్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసింది.

గ్రూప్-1 ప్రలిమినరీ పరీక్ష పటిష్ట ఏర్పాట్ల నడుమ మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 4వేల 412 మంది అభ్యర్థుల కోసం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 34 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 82 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి పరీక్షా కేంద్రంలో ఇద్దరు అబ్జర్వర్లు, 12 మంది చీఫ్ సూపరిండెంట్లు, 53 మంది చెకింగ్ స్క్వాడ్స్ తమ విధులను నిర్వహించారు.

రక్తదాన శిబిరాలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సఖి మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఆసుపత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ఈనేపథ్యంలోనే రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, గోవింద్, ఓం నారాయణ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మహిళ ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బంది

వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయ సమీపంలో రాజమణి అనే మహిళ ప్రమాదవశాత్తు చేత బావిలో పడింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ..ఆ మహిళను రిస్క్ చేసి ప్రాణాలతో కాపాడి బయటకు తీశారు. చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడి నందుకు స్థానికులు, పట్టణ ప్రజలు ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

జలవనరులశాఖ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తిచేయాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలా చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్