పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మె ల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. రైతులు ఆందోళన చేందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. మూడేళ్ల క్రితం అయిల్ ఫామ్ సాగు ప్రారంభించామని హరీశ్ రావు గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ పంట అంటే చాల మంది రైతుల్లో అనుమానాలు ఉండేవని, ఖమ్మం సహా ఎపిలోని ప్రాంతాల్లో రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారని తెలిపారు.