23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

బీజేపీ అధికారంలోకొస్తే…

బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్నర్ మీటింగ్‌కు మంత్రితో పాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి హాజరయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పంద రాజకీయం నడుస్తోందన్నారు శ్రీనివాసరెడ్డి.

మోసాలు, అబద్దాలు

 చంద్రబాబు చెప్పేవన్నీ మోసాలు, అబద్దాలంటూ మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరగవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జగన్‌ వస్తేనే ప్రజలందరికి న్యాయం జరుగుతుం దన్నారు. మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి విజయం చేకూర్చాలని కోరారు.

అల్లుడి సందేశం – మామకు షాక్‌

మంత్రి అంబటి రాంబాబు కి ఇంటి పోరు తప్పలేదు. మామకు ఓటేయ్యవద్దు అంటూ స్వయానా మంత్రి అల్లుడు ఓటర్లకు సందేశమిచ్చి గాలి తీసేసారు. ఒకవేళ ఓటు వేయాలనుకుంటే విజ్ఞతతో ఓటేయ్యా లంటూ ఆ సందేశంలో పేర్కొన్నాడు. మామపై అల్లుడి సందేశం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

కరీంనగర్ జిల్లా వీణవంకలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వీణవంకలో మాజీ సీఎం కేసీఆర్ బసచేసిన రోజే వీణవంక, చల్లూరు గ్రామల నుండి సుమారు 400 మంది బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వనించారు హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్.

పోస్టల్‌ బ్యాలెట్‌

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌కు ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు అధికారులు. నియోజకవర్గం వ్యాప్తంగా 2వేల 250 పోస్టర్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

గట్టి బందోబస్తు నడుమ..

చిత్తూరు జిల్లా కుప్పంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పటిష్ట బందోబస్తు మధ్య నడుస్తోంది. పోలింగ్‌ కొరకు కుప్పం డిగ్రీ కళాశాలలో మూడు కౌంటర్లను ఏర్పాటు చేసారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద్యోగులు తరలివచ్చారు. 851 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.

డీఎస్పీలపై బదిలీ వేటు

ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల వేళ వీరిద్దరిపై అందిన ఫిర్యాదుల మేరకు అనంతపురం, రాయచోటు డీఎస్పీలు వీర రాఘవ రెడ్డి, మహబూబ్‌ భాషాను బదిలీ చేసింది ఈసీ.

సిద్దిపేటలో 5K రన్‌

ఓటు అనేది ప్రతీ ఒక్కరి హక్కు అన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను చౌదరి. ఓటు విలువ, ఓటు  ప్రాధాన్యతను వివరిస్తూ సిద్దిపేటలో 5K రన్‌ జరిగింది. రన్‌ను కలెక్టర్‌ మను ప్రారంభించగా, సిద్ది పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఓల్డ్‌ బస్టాండ్‌ వరకు ఈ రన్‌ కొనసాగింది.

మత్తు వదల్లేదు

స్టేషన్‌ మాస్టర్‌ నిద్రమత్తులో జోగుతూ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో అర్ధగంటపాటు ట్రైన్ నిలిచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఇటావా సమీపంలోని, ఉడిమోర్‌ జంక్షన్‌ వద్ద జరిగింది. స్టేషన్‌ మాస్టర్‌ ను మేల్కొలిపేందుకు లోకో పైలట్‌ పలు మార్లు హారన్‌ మోగించినా ఫలితం లేదు. ఉద్యోగి నిర్లక్ష్యా న్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్