26.7 C
Hyderabad
Friday, December 13, 2024
spot_img

ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. కీలక నేతపై సస్పెన్షన్ వేటు

స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొత్త మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ట్ర స్థాయి నేతలపై నిరాధార ఆరోపణలు, బహిరంగ ప్రకటనలు చేసినందున బుధవారం ఆయనపై వేటు వేసింది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎవరైనా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, పార్టీ సీనియర్ల పేర్లు ప్రస్తావించడం సరైంది కాదని హెచ్చరించారు. పార్టీలో అంతర్గత సమస్యలేవైనా ఉంటే ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా ముఖంగా బహిరంగ ప్రకటలు చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కాగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో కొత్త మనోహర్ రెడ్డి కూడా ఉన్నారు.

Latest Articles

స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఈ విజన్‌ డాక్యుమెంటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్