ఏ తప్పు చేయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకోసం పోరాటాలు చేసేవారు జైలులో ఉన్నారని… అరాచకాలు, అక్రమాలు చేసేవాళ్ళు బయట ఉన్నారని విమర్శించారు. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డుగా గోడ కట్టి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధించారన్నారు. వేధింపులు తాళలేకనే మాజీసర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.