శరీర విధుల్లో అతి ముఖ్యమైన నిద్రను లైట్ తీసుకుంటున్నారా.? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవంటు న్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత కాలంలో మారుతున్న లైఫ్ స్టయిల్‌తోపాటు నిద్రను దరిచేరినివ్వకుండా ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య అధికమైంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్దివైపు పరుగులు పెడుతున్నసమాజం.. అంతే వేగంగా అనారోగ్యం వైపు అడుగులు వేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యానికి సంజీవనిలాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తే.. లైఫ్‌కు చెక్ పెట్టుకున్నట్టే. మరి నిద్రకు దూరమైతే కలిగే నష్టాలేంటి..? ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది..?
మానవ మనుగడ ఉరుకులు, పరుగులమయమైంది. లైఫ్ స్టైల్ మారడంతో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మరీ ముఖ్యంగా పగలు పని చేసి, రాత్రిళ్లు నిద్రపోయే పరిస్థితులు మారిపోయాయి. నిద్రతో పోటీ పడే కాలం వచ్చిందంటే ఆశ్యర్యపోనవసరం లేదు. అవును ఉద్యోగాల రీత్యేకాదు.. చేతిలో ఫోను, ల్యాప్‌ట్యాప్ ఉంటే తెల్లారిపోయింది కూడా తెలియనంత మైకంలో మునిగిపోతున్నాం. దీంతో ఆరోగ్యానికి సంజీవనిలాంటి నిద్రను నిర్యక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యం బారిన పడుతున్నాం. ఐటీ రంగంలో పని చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి ఫుడ్ డెలీవరి బాయ్స్ వరకూ ప్రస్తుతం పగలు కన్నా రాత్రిళ్లే ఎక్కువగా పని చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ల నుంచి ఆఫీసుల్లో పని చేసే సెక్యూరిటీగార్డుల వరకూ రాత్రులు పని చేసే వారి సంఖ్య అధికమైంది. ఇక మహానగరం విషయానికి వస్తే దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ఇకపోతే హైదరాబాదీలకు నైట్ ఔట్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ప్రతీ రోజు లేట్ నైట్ నిద్రపోవడం, లేదంటే రాత్రిళ్లు మేల్కొని ఉండటంతో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటివల లండన్ లోని ఒక కళాశాల జరిపిన అధ్యాయనంలొ తక్కువ నిద్ర పోయిన వారిలో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలబారినపడినట్టు తేలింది. రాత్రి వేళల త్వరగా పడుకునే వారిలో న్యూరో డెవలప్మెంట్ డిసీజెస్, జర్నలైసేడ్ యాంగ్సిటీ డిసార్డర్, మెంటల్ బిహేవియర్ లాంటివి చాలా తక్కువ ప్రభావం కనబడిందని అధ్యయనం చెబు తోంది. ఇక మొత్తానికి ఈ స్టడీ ప్రకారం ప్రతి ఒక్కరు రాత్రి సమయాల్లో వీలైనంత త్వరగా, ప్రశాంతంగా నిద్రపోతే ఎలాంటి రోగాలు దరి చేరవని.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు
మంచి ఆరోగ్యకరమైన నిద్ర మెదడులొని జ్ఞాపకాలను ఎక్కువకాలం గుర్తు పెట్టుకోవడానికి, భావోద్వే గాలను ఎక్స్ ప్రెస్ చేయడానికి, బెటర్ డెసిషన్స్ తీసుకోవడం లాంటి ఫంక్షనింగ్‌కి నిద్ర ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రపోతున్న సమయంలో మన మెదడు ప్రతిరోజు జరిగే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందని, మనం నేర్చుకున్న వాటిని పటిష్టంగా ఉంచుకొనేలా మనిషిని తయారు చేస్తుందని చెబుతున్నారు. అంతేగాక మరుసటి రోజు ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సిద్ధంగా చేస్తుందని స్టడీలో తేలినట్టు తెలిపారు. ఇక నిద్రలేమి వల్ల ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులకు గురవుతారని, ముఖ్యంగా ఎమోషనల్, సైకలాజికల్ కండిషన్స్‌కు తగ్గట్టుగా మెదడు పనిచే సేందుకు ఎక్కువ సమయం నిద్ర చాలా అవసరమైనదంటున్నారు. ఒక్కోసారి నిద్రలేమి వల్ల మానసిక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. నైట్ డ్యూటీ చేసే వారు సైతం ఉదయం సమయంలో అయినా ఎక్కువ సేపు నిద్రకు సమయాన్ని కేటాయించడం మంచిదని సూచిస్తున్నారు. లేదని లైట్ తీసుకున్నారో ఆరోగ్యాన్ని అమ్ముకున్నట్టేనని, తస్మాత్ జాగ్రత్త అంటు న్నారు.ఇకనైనా ఆరో గ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యుల సూచనతో నిద్రకు సమయం కేటాయిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడు కుందాం. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉందాం.