గోపిచంద్ తాజాగా నటించిన ‘రామబాణం’ చిత్రం మే 5న విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఛానెల్ లో యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న’సుమా అడ్డా’షో కార్యక్రమంలో గోపిచంద్, డైరెక్టర్ శ్రీవాస్, హీరోయిన్ డింపుల్, కమెడీయన్ గెటప్ శ్రీను పాల్గొన్నారు. ఈ షోలో ఎప్పుడూ రిజర్వ్ గా ఉండే గోపిచంద్.. సుమపై సెటైర్లు వేస్తూ చాలా యాక్టివ్ గా కనిపించాడు. ఏప్రిల్ 29న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో గోపించంద్.. సుమ గొంతు పట్టుకున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.


