Makhana Benefits |మఖానా వల్చఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది దీనిని డ్రై ఫ్రూట్స్‌గా భావిస్తారు. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారింది. ప్రజలు దీనిని నెయ్యిలో వేయించి, ఖీర్ తయారు చేసి, స్వీట్లలో డ్రై ఫ్రూట్స్‌గా కలుపుకొని తింటున్నారు. కొందరు వ్యక్తులు కూరగాయలలో కలుపుకొని తింటున్నారు. మఖానా రుచి చల్లగా ఉంటుంది కానీ ఇది చలికాలం, వేసవి కాలం రెండు కాలాలలోను తింటారు. ఇందులో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటుంది. అయితే మెగ్నీషియం, కాల్షియం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా కనిపిస్తాయి. ఇది కాకుండా మఖానా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. రోజూ ఖాళీ కడుపుతో 4 నుంచి 5 మఖానాలు తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని మఖానా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Makhana Benefits |షుగర్ కంట్రోల్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు మఖానా చాలా మంచి చిరుతిండి. డయాబెటిక్ రోగులు రోజూ ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా 4 నుంచి 5 మఖానాలు తింటే వారి షుగర్ అదుపులో ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి ప్రయోజనం: మీకు గుండె సంబంధిత వ్యాధి ఉంటే మీరు తప్పనిసరిగా మఖానా తినాలని వైద్యులు చెబుతారు. మఖాన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బిపిని నియంత్రిస్తుంది. కానీ మీకు అధిక బిపి సమస్య ఉంటే ఉప్పుతో కలిపి తీసుకోకండి.
Read Also: విడాకుల దిశగా నిహారిక-చైతన్య జంట.. రంగంలోకి మెగాస్టార్?
Follow us on: Youtube Instagram