స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళి సై తీవ్రస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే గవర్నర్ కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం ఇచ్చే రూ.10 వేల సాయానికి మరో రూ.10 వేలు కేంద్రం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ముందుకు పోతుంటే.. బీజేపీ నాయకుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయిలో ఉన్న తమిళి సై రాజకీయాలు చేయడం తగదని అన్నారు.