ఏపీవ్యాప్తంగా యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైలుపై సంతకం పెట్టిన కొన్నిగంటల్లోనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో స్కిల్ మ్యాన్ పవర్ అవసరం పెరిగిందని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. నైపుణ్యం కరువవడం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయి. అయితే 80 శాతం వరకూ ఉన్న యువతలోని నైపుణ్యంపై ప్రభుత్వాలకు, పరిశ్రమలకు అవగాహన లేదు. పరిశ్రమల డిమాండు మేరకు యువతలో నైపుణ్యాలు కరువవుతున్నాయని తెలిపింది.