ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇవాళ విజయవాడలో మరో షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందుకోసం విజయవాలో షూటింగ్ కోసం ప్రత్యేక సెట్లు వేశారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తైంది. మధ్యలో షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తాజాగా మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.