స్వతంత్ర, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పిల్లలను అమ్మే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుగూడలో ఇద్దరు అడ పిల్లలను రూ. 5. 50 లక్షలకు ఓ తల్లిదండ్రులు అమ్మారు. ఒక పాపకు రూ. 2 లక్షల 50 వేలు, మరో పాపకు 3 లక్షలకు బేరంతో ఆదిలాబాద్ నుండి కర్నాటకలోని కుంటర్వాకకు అమ్మారు. ఈ తతంగంలో ఆర్ఎంపి డాక్టర్ జగన్నాథ్ మధ్యవర్తిగా ఉన్నట్లు తేలింది. పిల్లల అమ్మకంలో మొత్తం 12మంది ముఠా ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. 9 మందిని అరెస్టు చేశారు మరో ముగ్గురు నిందితుడు పరారీలోఉన్నారు. పిల్లలను అమ్మిన తల్లిదండ్రులను, కోనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిడిఎస్ అధికారుల సమాచారంతో బయటపడిన ముఠా వ్యవహారం బయటపడింది.