మాజీమంత్రి హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైరయ్యారు. ఇంకా అధికారం లో ఉన్నామనే భ్రమతో హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని అంతాయిపల్లి గ్రామంలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్‌బుక్‌లు సృష్టించి రిజిష్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలువబోతున్నమని ఆశాభావం వ్యక్తం చేశారు.


