కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించి, పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా దివంగత పి. జనార్దన్‌రెడ్డి నిలిచారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండి, తన తుది శ్వాస వరకు విలువలతో కూడాన రాజకీయాలకు పీజేఆర్ అంకితమైన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి. జనార్దన్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఆయన కుమార్తె విజయరెడ్డి నివాళి అర్పించారు. పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, వేముల నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.