Sircilla |రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గురుకుల పాఠశాలలో లేదా వసతి గృహాల్లో విద్యార్థులకు పెడుతున్న ఆహరం ఫుడ్ పాయిజన్ అవడంతో వాంతులు విరేచనాలు అవుతున్నాడు. తాజాగా, నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి విద్యార్థినులు ఆహారం తీసుకోగా.. అది కాస్త ఫుడ్ పాయిజన్ కావడంతో 24 మందికి విరేచనలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో లచ్చాలు ఆరా తీస్తున్నారు.
Sircilla |తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధ్యార్థుల కోసం ఉచిత భోజన పథకం తీసుకొచ్చింది. విద్యార్థుల సంక్షేమం కోసం, ఆరోగ్యంగా ఉండాలి చక్కగా చదువుకోవాలన్న నెపంతో పేద విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తుంది. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు, వీటిని పేద విద్యార్థులకు అందకుండా.. ఎక్కడికక్కడ స్వాహా చేస్తున్నారు. చివరికి విద్యార్థులు నాసిరకం ఫుడ్ తినడంతో ఇలా అస్వస్థతకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు.. చాలా నిస్సహాయతను తెలుపుతూ… మేం కారంతో అయినా మా బిడ్డల కడుపునింపుతాం.. కానీ ఇలాంటి ఆహారాన్ని మా పిల్లలు తిని ప్రాణాలు కోల్పోతే మేం తట్టుకోలేము అని తమలో తాము కుమిలిపోతున్నారు. రాష్ట్రప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే.. దయచేసి ఇలాంటి ఘటనలపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప.. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునారవృతం కావు. పేద పిల్లల తల్లిదండ్రులమైన మేము.. విధ్యార్ధులను బడికి పంపి హాయిగా ఊపిరి పీల్చుకుంటామని అంటున్నారు.
Read Also: తెలంగాణాలో తాజాగా 54 కొత్త కేసులు
Follow us on: Youtube Instagram