దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 41 నిమిషాల విమానాల ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.. అలాగే, పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది..
మరోవైపు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర భారత్ లో గత కొన్ని వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో వందలాది విమానాలు, రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు