Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం కలకలం రేపింది. నకిలి టిక్కెట్లతో తిరుపతికి చెందిన దళారి వేణు అనే వ్యక్తి భక్తులను మోసం చేసినట్లు తేలింది. ఇతను హైదరాబాద్ కి చెందిన భక్తుల వద్ద 7 సుప్రభాత సేవా టిక్కెట్లకు రూ.30 వేలు వసూలు చేశారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అయితే తనిఖీ చేసే క్రమంలో టిక్కెట్లన్నీ నకిలీవని గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి దళారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.
Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్
Follow us on: Youtube, Instagram, Google News