స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు రాజాపానగల్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ కరెన్సీ టెస్సీ సెంటర్ లో ఎస్పీఎఫ్ గార్డ్ వెంకటేశ్వర్లు గన్ పేలింది. దీంతో తలలోకి బుల్లెట్ వేగంగా దూసుకెళ్లడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. గన్ మిస్ ఫైర్ అయ్యిందా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


