స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కన్నడ పీఠాన్ని ఎవరు వరిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. పార్టీ అభ్యర్థులు, అధికారుల నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన కౌంటింగ్.. ఉదయం 8:40 కు వచ్చిన ఫలితాలు వెల్లడించారు. దీనిప్రకారం.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. ఉదయం 8.40 గంటల వరకు ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యం 54 దాటింది. బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా.. జేడీఎస్ 13 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది.


