10 మంది పోలీసులను సర్వీస్ నుండి తొలగించడం పట్ల తీవ్రంగా ఫైరయ్యారు మాజీమంత్రి హరీశ్‌రావు. ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరితే.. 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగించడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్ననని చెప్పారు. తాను కూడా పోలీసు కుటుంబం నుంచి వచ్చానని..వారి కష్టాలు తనకు బాగా తెలుసంటూ ఎన్నకల ముందు ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి..అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.