ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రెండు శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తారు. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. అందులో భాగంగానే మరోసారి సమీక్షకు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయం, ఖర్చులు, రాబడిపై ఆరా తీయనున్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై కూడా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. మరోవైపు.. సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.