తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుండు సున్నా ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి కేంద్రం 100 కోట్ల నిధులు ఇచ్చిందని.. తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది సున్నా అని.. ఇదే సమయలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధుల కింద 15 వేల కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. లోక్‌సభలో బీఆర్ఎస్ బలమైన స్థానంలో ఉండి ఉంటే.. ఈ అన్యాయాన్ని తాము జరగనిచ్చే వాళ్లం కాదని అన్నారు. మరోసారి తెలంగాణను పక్కన పెట్టారా? అని ప్రశ్నించారు.