వరంగల్ లోనూ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వరంగల్ ఎంపీ బరిలో 42 మంది అభ్యర్థులు పోటీ పడగా వరంగల్ లోక్ సభ పరిధిలో 68.29శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఎన్నికల పూర్తి కాగానే ఈవీఎంలలు, వీవీ ప్యాట్లను వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాముకు తరలించారు. మూడం చెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఏనుమాముల మార్కెట్లో ఓట్ల లెక్కింపు పనుల ను పర్యవేక్షించారు. ఓట్లను లెక్కించేందు కు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభం అయి, మధ్యాహ్నం 12గంటల వరకు ఓటింగ్ సరళి బయటకు రానుంది.


