Delhi Liquor Scam |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Sreenivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇదే కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరెస్టయ్యారు. ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ‘సౌత్ గ్రూప్’లో మాగుంట కుటుంబం కీలకంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ శ్రీనివాసులురెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.