Drunk and Drive | హైదరాబాద్ మహానగరంలో వీకెండ్ వచ్చిందంటే చాలు రెచ్చిపోతున్నారు మందుబాబులు. శుక్రవారం నుంచి ఆదివారం రాత్రి వరకు పబ్బులు, పార్టీలు అంటూ తాగి… వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుమీదకు రావడంతో ప్రతి వీకెండ్ కు ట్రాఫిక్ కష్టాలు తప్పట్లేదు. ఇప్పుటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అయినా మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లకు అస్సలు భయం కలగడం లేదు. చలానాలు, కేసులు నమోదు చేస్తున్న.. డ్రంక్ అండ్ డ్రైవ్ మానటం లేదు. దీంతో మరోసారి నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. వీకెండ్ కావడంతో కావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్,హైటెక్ సిటీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో పదుల సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డాయి. దీంతో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసుల చర్యలు చేసుకున్నారు.