21.7 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

వివాదాలను మూటగట్టుకుంటున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడి గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఈలోగానే అయన అనేక వివాదాలు మూటగట్టుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్…లో భాగంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇందుకు సంబంధించి తన మనసులోని మాటలను బయటపెడుతున్నారు. అంతిమంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.

గ్రీన్‌లాండ్ దీవిని అమెరికాలో కలిపేసుకోవాలన్న కోరికను ట్రంప్ మరోసారి బయటపెట్టారు. వాస్తవానికి గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన ఒక దీవి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దీవి ఇది. అవసరమైతే సైన్యాన్ని దింపి అయినా, గ్రీన్‌లాండ్ దీవిని కొనుగోలు చేస్తామని తెగేసి చెప్పారు ట్రంప్. వాస్తవానికి గ్రీన్ లాండ్ విషయంలో ట్రంప్ మంకుపట్టు పట్టడం ఇదే తొలిసారి కాదు. డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్‌లో కూడా గ్రీన్‌లాండ్ దీవిని కొనాలని ఆయన భావించారు. గ్రీన్‌లాండ్ దీవిపై ట్రంప్ ఆసక్తి చూపడం వెనుక అనేక కారణాలున్నాయి. గ్రీన్‌లాండ్ దీవికి, జియో పాలిటిక్స్ పరంగా ప్రాధాన్యం ఉంది. వాయవ్య గ్రీన్‌లాండ్ లో ఒక కీలక ఎయిర్ బేస్ ఉంది. మాస్కో, న్యూయార్క్‌కు మధ్యలో ఈ ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ్నుంచి అమెరికా భూభాగాలపై దాడి చేయడానికి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా భద్రత దృష్ట్యా, గ్రీన్‌లాండ్‌ దీవిని స్వాధీనం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. దీంతో అవసరమైతే సైనిక వినియోగాన్ని కూడా తోసిపుచ్చేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే గ్రీన్‌లాండ్ దీనిని ఎటువంటి పరిస్థితుల్లోనూ అమెరికాకు దారాదాత్తం చేసేది లేదని గ్రీన్‌లాండ్ ప్రధాని మెటే ప్రెడెరిక్సన్ తేల్చి చెప్పారు. గ్రీన్‌లాండ్ అంశాన్ని ట్రంప్ మరచిపోవాలన్నారు ప్రధాని మెటే ప్రెడెరిక్సన్.

అలాగే కెనడాకు సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఇటీవల కెనడా ప్రధాని పదవికి జస్టిస్ ట్రూడో రాజీనామా చేసే సందర్భంలో , అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడానికి కెనడా అంగీకరిస్తే, సదరు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానన్నారు. అమెరికాలో కెనడా విలీనమైతే, సదరు దేశంపై ఎటువంటి సుంకాలు, పన్నులు ఉండవని హామీ ఇచ్చారు. అంతేకాదు రష్యా, చైనా నుంచి అమెరికా రక్షణ కల్పిస్తుందన్నారు. కథ అక్కడితో ఆగలేదు. అమెరికా దేశంలో కెనడా విలీనమైనట్లుగా తయారు చేసిన ఒక మ్యాప్‌ను ట్రంప్ తన పోస్టుకు జత చేశారు.

అంతేకాదు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానంటూ ఇటీవల ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. దీనికి మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ స్పందించారు. అమెరికాకు తామెందుకు మెక్సికన్ అమెరికా అని పిలవకూడదంటూ చురకలు వేశారు.అంతేకాదు 17వ శతాబ్దంలో ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పిలిచేవారన్నారు క్లాడియా షేన్‌బామ్.

ట్రంప్, ఒక దేశం తరువాత మరొక దేశంలో వేలు పెడుతుండటాన్ని యూరప్ గమనించింది.దీంతో ఐరోపా సమాఖ్య అప్రమత్తమైంది. యూరప్ జోలికి ట్రంప్ మహాశయుడు వస్తే , సహించే ప్రసక్తేలేదని ఫ్రాన్స్ కుండబద్దలు కొట్టింది. ఐరోపా సమాఖ్యలో ఉన్న అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాయని ఫ్రాన్స్ పేర్కొంది. దీంతో ఐరోపా సమాఖ్య దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని అమెరికా సహా ఎవరు ఉల్లంఘించినా, ఊరుకునేదే లేదని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి జీ నోయల్ బారో తేల్చి చెప్పారు. మొత్తంమీద ట్రంప్ వ్యాఖ్యలు, ఇందుకు ఆయా దేశాల ప్రతిస్పందనలతో అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య దూరం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, సుంకాల విషయంలో డొనాల్డ్‌ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత అనేక ప్రపంచదేశాలపై సుంకాలు విధించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా తన నిర్ణయాలకు చట్టబద్దత కల్పించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికావ్యాప్తంగా ఆర్థిక ఎమెర్జెన్సీని విధించాలన్న భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నేషనల్ ఎకనమిక్ ఎమెర్జెన్సీ ప్రతిపాదన పట్ల అమెరికా సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ ఎకనమిక్ ఎమెర్జెన్సీ విధించడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి ముందే, డొనాల్డ్ ట్రంప్ పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్