25.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

చల్లని కూల్ డ్రింక్స్‌తో అనారోగ్యం..

స్వతంత్ర వెబ్ డెస్క్: చాలామంది విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇక వేసవి కాలంలో చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కూలిడ్రింక్స్ సీసాల కొద్దీ తాగేస్తుంటారు. తిన్నది అరిగించుకునేందుకు, దాహం వేసినప్పుడు మంచి నీళ్లు తాగాల్సిన చోట, చాలామంది కూల్ డ్రింక్స్ తోనే దాహం తీర్చుకుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని, సాధ్యమైనంత వరకూ కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

>కూల్ డ్రింక్స్ శరీరాన్ని చల్లబర్చటానికి బదులుగా యాసిడ్ స్ధాయిలను పెంచి షుగర్ లెవెల్స్‌ను పెంచేస్తాయి. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశలు ఎక్కువ అంటున్నారు నిపుణులు.

> కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దంతాలు కూడా బలహీనపడి అవకాశం ఉంటుందంట. కూల్ డ్రింక్స్ తాగని వారి దంతాల కంటే, కూల్ డ్రింక్స్ తాగే వారి దంతాలు తొందరగా ఊడిపోతాయని చెబుతున్నారు.

> శీతాల పానియాల్లో అధిక కేలరీలు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, శరీరంలో అధికంగా డోపమైన్ ఉత్పత్తి చేస్తుందని, అందువల్ల రక్తపోటు పెరుగుతుందని, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో హైబీపీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

>గర్భవతులుగా ఉన్న మహిళలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే గర్భ స్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందట. కూల్ డ్రింక్స్ తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌లు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

> కూల్‌డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది. అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

>కూల్ డ్రింక్స్ తాగుతున్న సమయంలో ఎంజాయ్ చేసినట్టుగా అనిపించినా, దాని దుష్ప్రభావాలు మన ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక కూల్ డ్రింక్స్ తాగడం బాగా అలవాటైన వారు, ఆ అలవాటును మార్చుకోవడానికి కూల్ డ్రింక్స్ స్థానంలో పండ్ల రసాలను తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్