రామగుండం బి పవర్‌హౌస్ స్థానంలో సింగరేణి పవర్‌హౌస్ కాకుండా జెన్కో ద్వారా కొత్త విద్యుత్ కర్మాగారం నిర్మించా లని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మికనేత కౌశిక హరి మాట్లాడారు. స్థానికులు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలంటే బీ పవర్‌హౌస్‌ను విస్తరించాలని హరి డిమాండ్ చేశారు. రామగుండం ప్రాంత ఎమ్మెల్యే లు, అధికార పార్టీ నేతలు బి పవర్‌హౌస్‌ను విస్మరించారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రామగుండంలో ఇప్పటికైనా జెన్కో, గోదావరిఖనిలో సింగరేణి పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు.


