రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ మ్మెల్యే లాస్య నందిత మృత దేహాన్ని ఆమె ఇంటికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం తరలించారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత కూడా లాస్య కుంటుబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లాస్య ఇంటికి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత చిన్న వయసులోనే కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. వరుస ప్రమాదాలు ఆమెను వెంటాడాయి. ఇప్పటికే రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా కాలం కలిసిరాలేదు. మూడో ప్రమాదం నుంచి గట్టెక్కలేదు. చివరకు రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏడాది కాలంలోనే తండ్రి కూతుళ్ల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి
మరోవైపు లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. లాస్య నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసుల భావిస్తున్నారు. రెయిలింగ్ ను ఢీకొట్టిన కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోయారు. ప్రమాదం సమయంలో ఎమ్మెల్యే లాస్య.. డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్, వెనక కూర్చున్న పీఏ వాళ్లిద్దరూ గాయాలతో బయటపడినా.. ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య ఒక్కరే చనిపోవటానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవటమే అంటున్నారు పోలీసులు.
సీటు బెల్ట్ పెట్టుకున్న డ్రైవర్ గాయాలతో బయటపడినా.. ఆ పక్క సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య.. సీటు బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో ప్రమాదం జరిగిన తర్వాత భారీ కుదుపునకు గురవ్వటంతోపాటు.. ఎమ్మెల్యే లాస్య కూర్చున్న వైపు.. ఔటర్ రింగ్ రోడ్డు రైలింగ్ కు బలంగా ఢీకొన్నది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు ఉంటుందని భావిస్తున్నారు. అంత వేగంగా వెళ్లి.. రైలింగ్ ను ఢీకొనటం వల్లే ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయింది. ఎమ్మెల్యే లాస్య నందితను ప్రమా దాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్‌లో ఇరుక్కు పోవడం, పదిరోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ ను ఢీకొట్టడంతో చనిపోవడం.. ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడాయి.
ఇటీవలె నల్గొండ సభకు హాజరైన లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డు చనిపో యాడు. అయితే, మృత్యువు ఇవాళ మరో రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చింది. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. సదాశివపేటలో ఓ పార్టీకి హాజరై.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్‌లోనే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆకాశ్‌ను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాదికే.. ప్రజాప్రతినిధులైన ఈ తండ్రీ కూతుళ్లిద్దరూ మృతి చెంద డంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి, కూతురు మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 1987లో హైదరాబాద్‌లో జన్మించిన లాస్య నందిత.. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2016లో సాయన్న తోపాటు బీఆర్ఎస్‌లో చేరారు. 2016 నుంచి 2020 వరకు కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. సాయన్న గుండె పోటుతో మృతి చెందడంతో కంటోన్మెంట్ స్థానంలో లాస్య నందితకు బీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. బీజేపీ అభ్యర్థిపై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.


