ముంబైలో బీభత్సం సృష్టించిన గాలివాన

ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్‌కోపర్‌, ములుండ్‌, విఖ్రోలి, దక్షిణ ముంబ యిలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది. ఘాట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్‌ ఈదురుగాలుల తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్‌ పంపుపై పడింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. 70 మంది గాయప డ్డారు. ఈ హోర్డింగ్‌ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

మరోవైపు వడాలాలోని బర్కత్‌ అలీ నాకాలో శ్రీజీ టవర్‌ సమీపంలో వడాలా-అంటోప్‌ హిల్‌ రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెటల్‌ పార్కింగ్‌ టవర్‌ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమ య్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్‌ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్‌ రైలు సేవ లను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్