ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లు తరలించిన అధికారులు
తెలంగాణలో చెదురుముదురు ఘర్షణలు మిగనహా…సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. నిన్న ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరు గంటలకు వరకు కొనసాగింది. ఆరు గంటల లోపు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు అర్థరాత్రి వరకు ఓటింగ్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఓటింగ్ ప్రక్రియ ముగియగానే ఈవీఎంలను సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
సరూర్‌నగర్ స్టేడియంకు ఈవీఎంలు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గ పోలింగ్ బూత్‌ల నుంచి ఈవీఎంను తరలించారు సిబ్బంది. సరూర్‌నగర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ట భద్రత నడుమ తీసుకెళ్లారు.
డీఆర్సీ సెంటర్‌కు ఈవీఎంలు..
రిలింగంపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు వెంటనే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. నియోజకవర్గ పరిధిలోని చందానగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్ కేంద్రాల్లోని…ఈవీఎం, వీవీప్యాడ్‌లు సీజ్ చేసి, గచ్చిబౌలి డీఆర్సీ సెంటలర్‌కు తరలించారు అధికారులు.
గీతం యూనివర్సిటీకి ఈవీఎంలు తరలింపు
ఉమ్మడి మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. క్యూలైన్‌లో ఓటర్లకు రాత్రి వరకు ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత సిబ్బంది ఈవీఎంలను భారీ భద్రత మధ్య నర్సాపూర్‌లో గల BVRITలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. ఇక జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించిన అన్ని ఈవీఎంలను రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో గల స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు
వరంగల్ పార్లమెంట్‌కు సంబంధించి ఈవీఎంలను సిబ్బంది…ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. సెక్టార్ అధికారుల నిశిత పరిశీలన అనంతరం పోలింగ్ మెటీరియల్ సామగ్రిని తీసుకున్నారు.
ముధోల్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు ఈవీఎంలు
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ తర్వాత సిబ్బంది అత్యంత భద్రత మధ్య…ఈవీఎంలను ప్రత్యేక వాహనాల్లో ముధోల్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు తీసుకెళ్లారు.
ఈవీఎంలకు భారీ భద్రత….
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ పోలింగ్ బూత్‌ల నుండి అధికారులు ఈవీఎం బాక్సులను అప్పగించారు. చేవెళ్ల మండల పరిధిలోని, గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని ఈవీఎంలను బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి తరలించారు. పోలీస్ సిబ్బంది, సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. A, B రెండు బ్లాకులను ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను భద్రపరిచారు. జూన్ నాలుగు ఫలితాలు వెల్లడించ నున్నారు.
చిత్తూరు జిల్లాలో 85 శాతంపైనే ఓటింగ్
చిత్తూరు జిల్లా నగిరిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నగిరి నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలా లకు గాను 231 పోలింగ్ బూత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు 76.81 శాతం ఓటింగ్ నమోదయిందని …ముగింపు సమయానికి 85 శాతం పైన ఓటింగ్ నమోదు కావచ్చు అని నగరి తహసీల్దార్ తెలిపారు. చెదురు ముదురు సంఘటనల మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు.
స్ట్రాంగ్ రూమ్‌లకు భారీ భద్రత
ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఈవీఎంలను అధికారులు భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. మైలవరం నియోజకవ ర్గంలోని ఈవీఎం బాక్సులను ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజ్‌లో గల స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
పోలీసుల అత్యుత్సాహం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణలో పని చేసిన ఉద్యోగులపై లాఠీ ఝులిపించారు. ఇవ్వాల్సిన డబ్బులు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళ నకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.