స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో ఘరానా మోసం బయటపడింది. మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టోకరా వేశాడు సైబర్ నేరగాళ్లు. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో 20 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ట్రేడ్ ప్రాజెక్టులు కొనుగోలు చేసి తద్వారా డబ్బులు సంపాదించవచ్చంటూ చెప్పడంతో మహిళా సాఫ్ట్‌వేర్ నమ్మింది. ఇదే ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు మహిళకు మాయమాటలు చెప్పి నెమ్మదిగా ఆమె వద్దనుంచి డబ్బులు దోచుకోవడం ప్రారంభించారు. మొత్తంగా 20 లక్షల వరకు కాజేశారు. తీరా తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


