Bangalore |రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్షణక్షణం ఏదోఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఘటన గుండెల్ని పిండేలా చేస్తుంది. బెంగళూర్ లో జరిగిన ఈ దారుణం చూస్తే.. ఇలాంటి ఘటనను జరగటం ఏంటని తలపట్టుకుంటారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఓ ప్లాస్టిక్ డ్రమ్ లభించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి.. ముగ్గురు వ్యక్తులు గత రాత్రి డ్రమ్ను తీసుకువచ్చి రైల్వేస్టేషన్లో వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎవరు ఇలా చేశారు? మహిళను చంపడానికి గల కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.