స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ప్రయాణికులతో ఉన్న ఏడు బోగీలు పల్టీకొట్టాయి. దీంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 50మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాలాసోర్‌కు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న బహనాగ్ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.