కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. బీసీ ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. బీసీల జనాభా తగ్గి మిగతా వారి జనాభా ఎలా పెరిగిందని నిలదీశారు. ఏ కులం ఎంత ఉందో చెప్పమని అడిగితే వ్యక్తిగత సమాచారం ఇవ్వమని ప్రభుత్వం అంటుందన్నారు. పార్టీ పరంగా 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసనసభ సమావేశం అవసరమా అని పాయల్‌శంకర్ ప్రశ్నించారు.