స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బ్రిజ్ భూషన్ సింగ్. 38 రోజులపాటు జంతర్ మంతర్ లో బ్రిజ్ భూషన్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్ ను శిక్షించాలంటూ అల్లర్లు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లోని పోలీస్ స్టేషన్లో రెజలర్లు ఫిర్యాదు చేశారు. నేడు జంతర్ మంతర్ లోని తన నివాసం లో బ్రిజ్ భూషణ్ సింగ్ వాంగ్మూలాన్ని ఢిల్లీ పోలీసులు రికార్డ్ చేయనున్నారు.