సినిమా వాళ్లను కామెంట్ చేయడం తమాషా అయిపోయిందన్నారు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన… బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ప్రభుత్వాలు ఈ విషయంలో ఎవరు ఎలా మాట్లాడాలన్న దానిపై ప్రజాప్రతినిధులకు క్లాస్లు పెట్టాలన్నారు. చిత్ర పరిశ్రమ వాళ్లు తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.


