పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ ఆపిల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించనున్నారు. పలు కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ బృందం భేటీ కానుంది. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోనున్నారు. అమెరికాలో రెండు నగరాల పర్యటన సంతోషాన్నిచ్చిందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చల గురించి వివరించారాయన. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.