28.7 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

ఏటీసీల‌కు సీఎం రేవంత్ శంకుస్థాప‌న‌

ఆధునిక ప‌రిశ్రమ‌ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీఐల‌ను ఏటీసీలుగా తీర్చిదిద్దాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ తో ప‌దేళ్లకుగానూ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఏటీసీల‌కు సీఎం రేవంత్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. ఆధునిక ప‌రిశ్రమ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏటీసీల్లో యువ‌త‌కు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మి స్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల లాంగ్ ట‌ర్మ్‌ కోర్సుల్లో, 31 వేల 200 మందికి 23 ర‌కాల షార్ట్ ట‌ర్మ్‌ కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.గ‌త ప‌దేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవ‌లం 1.5 ల‌క్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీల‌తో రానున్న పదేళ్లలో 4 ల‌క్షల మంది శిక్షణ అందిచను న్నారు. ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌నిచేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల తోపాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్యత‌ర‌హా ప‌రిశ్రమ‌లు, భారీ ప‌రిశ్రమ‌ల‌కు టెక్నాల‌జీ హ‌బ్‌గా ప‌ని చేస్తాయి. ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్