29.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

రేపు పులివెందులలో నామినేషన్ వేయనున్న సీఎం జగన్

  రేపు పులివెందులలో ఏపీ సీఎం జగన్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్‌జోష్‌ కనపడు తోంది.ఈ జోష్‌లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య ముఖ్య మంత్రి జగన్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడప నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకోను న్నారు.

   పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్‌లో సీఎం పాల్గొనను న్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11.25 నుంచీ 11.40 గంటల లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం పులివెందుల నుంచి కడపకు చేరుకొని, కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు జగన్‌. సీఎం జగన్‌ నామినేషన్‌ ర్యాలీ కోసం వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టను న్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనో అంతకుమించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్‌. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొ నేలా సీఎం జగన్‌ ప్రచార షెడ్యూల్‌ సిద్ధమవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్