స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27 వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎం ఆఫీస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం హాజరు హాజరై… అందరికీ ఏపీ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించనున్నారు. అంతే కాకుండా ఏంఎస్ఎంఈలకు అందిస్తున్న సాయం… అలాగే వారికీ ఇచ్చే మద్దతు గురించి కూడా ఈ సమావేశంలో అధికారులతో చర్చించనున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో ఏమైనా సమావేశమయ్యే అయ్యే అవకాశం ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.