35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్ న్యూస్.. దసరా కానుకగా..

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం జగన్‌(CM Jagan)  ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపించారు.  చంద్రబాబు(Chandrababu) తన హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని, ముఖ్యమంత్రి వైఎస్‌ ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చులకన భావం ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులతో అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో(AP NGO) 21 రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిధిగా సీఎం జగన్‌ హాజరయ్యారు.

పెండింగ్‌లో ఉన్న డీఏను దసరా కానుకగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని స్పష్టం చేశారు. 53 వేల మంది హెల్త్ సెక్టార్‌లో నియమించామని అన్నారు. 2,06,668 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని సీఎం జగన్ తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం అన్నారు. మొక్కుబడిగా కొన్ని మాత్రమే ఉద్యోగులకు మిగిల్చారని దుయ్యబట్టారు. బాబు హయాంలో దాదాపు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని చెప్పారు. బాబు కాలంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటి?.. పాఠశాలల దుస్థితి ఎలాంటిది? అలాంటివారు ఉద్యోగులకు న్యాయం చేయగలరా? అని ప్రశ్నించారు. బాబు, ఆయన వర్గానికి తమ ప్రభుత్వంపై కడుపు మంట అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

Latest Articles

మెగా కోడలు మెప్పించేనా..?

అందాల రాక్షసి మూవీతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి సినిమాతోనే గుడ్ పర్ ఫార్మర్ అనిపించికుంది. ఆతర్వాత శ్రీరస్తు - శుభమస్తు, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్