CM Jagan | గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్(Global Investors Summit)వేదికగా ఏపీ సీఎం జగన్ రాజధాని గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని స్పష్టంచేశారు. తాను కూడా విశాఖకే షిఫ్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు. ఏపీ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని జగన్ చెప్పారు. కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశ ప్రగతిలో ఏపీ ఎంతో కీలకంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని.. మరో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయని వెల్లడించారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయని తెలిపారు. సహజ వనరులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని జగన్(CM Jagan) తెలిపారు.