కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సీనియర్ వైద్యుల ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో సోనియాకు క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నారు.