కొమురం భీం జిల్లా జైనూరు మండలంలో చిన్నపాటి గొడవ ఘర్షణకు దారి తీసింది. వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులకు ద్విచక్ర వాహనం తాకడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేయడంతో పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ సదయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వడ్డెర కాలనీలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఘర్షణలో ఇద్దరు ఆదివాసి యువకులకు తీవ్ర గాయాలు కావడంతో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకున దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


