21.7 C
Hyderabad
Wednesday, February 25, 2026
spot_img

రూ.4వేల కోట్ల అసైన్డ్ భూముల స్కామ్‌లో సీఐడీ ఛార్జ్‌షీట్

      ఏపీలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీఐడీ. అసైన్డ్ భూముల స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను పొందుపరిచారు. 4వేల 400 కోట్ల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లుగా సీఐడీ నిర్ధారించింది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లో స్కామ్ జరిగినట్లు సీఐడీ పేర్కొంది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయినిపాలెం, ఇతర గ్రామాల లో కుంభకోణం జరిగినట్లు ఛార్జిషీటులో స్పష్టం చేసింది సీఐడీ. అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా ఇచ్చినప్పటికీ ఉద్దేశ్య పూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి అధికారులు పేర్కొన్నారు.

      చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్లు ఛార్జ్ షీటులో పొందుపరిచింది సీఐడీ. మంగళగిరి తదితర సబ్ రిజిస్టర్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు మోపింది. రికార్డుల ను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయి లుగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్